అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి:
నష్టపోయిన రైతులకు న్యాయం చెయ్యాలి
Aisf జిల్లా ప్రధాన కార్యదర్శి బాలసాని లెనిన్
ఎంచర్ల తిరుమలేష్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి
పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ కంపెనీలు ఖరీఫ్ సీజన్ లో సీడ్ విత్తనాల అధిక దిగుబడి పేరుతో రైతులకు సీడ్ ఇచ్చి రైతులకు సరైన దిగుబడి రాక తీరా పంట నష్టపోయిక రైతులనీ పట్టించుకోక ఇబ్బందులకు గురి చేస్తున్న కంపెనీల సమావేశం ఏర్పాటు చేసి రైతులకు నష్టపరిహారం అందించేలా చూడాలని జిల్లా వ్యవసాయ అధికారి సీనియర్ అసిస్టెంట్ గారికి వినతిపత్రాన్ని అందించారు ఈ సందర్భంగా బాలసాని లెనిన్ మాట్లాడుతూ ప్రయివేటు కంపెనీలకు షరతులు విధించి రైతులను మోసం చేయకుండా కట్టడి చేయాలని జిల్లా వ్యాప్తంగా చాలా మంది రైతులు ఇప్పటికే ఇలాంటి ఇబ్బధులు చాలా ఎదుర్కొంటున్నారూ అని వాళ్లకు న్యాయం చేసిమళ్ళీ రబీ సాగులో ఇలాంటి ఇబ్బదులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో కలవెన మహేష్ గణేష్ శ్రీను తదితరులు పాల్గొన్నారు
