అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి జిల్లా:
పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్ గ్రామపంచాయతీ పరిధిలోగల పెద్దపల్లి నుండి కరీంనగర్ వెళ్లే రైల్వే ట్రాక్ లైన్ నిర్మాణ సమయంలో రైల్వే ట్రాక్ ను అను కొని ఉన్న గ్రామాల ప్రజలు సంతోషం అంతా ఇంతా కాదు మా ప్రాంతం గుండా రైల్వే లైను వెళ్లడం ద్వారా మా గ్రామాలలో రైల్వే స్టేషన్లు నిర్మించి పెద్దపల్లినుండి కరీంనగర్ వరకు రవాణా రాకపోకలు సులభతరం అవుతుందని ప్రజలు సంతోషించారు ముఖ్యంగా దస్తగిరి పల్లె చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే గ్రామాలు పెద్దబొంకూర్ పెద్దకాల్వల కొత్తపల్లి పెరకపల్లి చిన్న బొంకూర్ ఉప్పరపల్లె మూల సాల అంకంపల్లి ప్రాంత ప్రజలు దస్తగిరి పల్లిలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసినట్లయితే కరీంనగర్ కి వెళ్లడానికి సులువైన మార్గంగా అనుకున్నారు అలా జరగక పోను ఇప్పుడు అదే రైల్వే మార్గం లో దస్తగిరిపల్లె వద్ద గల రైల్వే బ్రిడ్జి కరీంనగర్ నుండి రామగుండం కు వెళ్లి రాజీవ్ రహదారికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఇరుకైన రైల్వే బ్రిడ్జి కారణంగా అభివృద్ధికి అవరోధంగా మారింది ఇరుకైన బ్రిడ్జితో పెద్ద వాహన దారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అదేవిధంగా వ్యవసాయ భూముల రేట్లు బ్రిడ్జి అవతల బ్రిడ్జి ఇవతల అనే విధంగా తయారయింది దస్తగిరిపల్లి కొత్తపల్లి మూల సాల ఉప్పరపల్లి కొలనూర్ అంకంపల్లి గ్రామాలకు ఓదెల కాల్వ శ్రీరాంపూర్ మండలాలకు రోజు వందలాది సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగుతుంటాయి చిన్న వర్షం కురిసిన మోకాలు లోతు నీళ్లు ఆ బ్రిడ్జి కింద ఎప్పుడు ప్రత్యక్షమౌతునే ఉంటాయి ఆ ప్రాంతం గుండ ప్రయాణించిన ప్రయాణికులను ఎవరినడిగినా చెబుతారు ఆ బాధ ఎంతో ,మా ప్రాంతం గుండా రైలు ప్రయాణం చేస్తామని సంతోషపడిన వ్యక్తులే నేడు మా ప్రాంతాల పారిశ్రామిక ఇతరత్రా అభివృద్ధికి రైల్వే బ్రిడ్జి అవరోధంగా నిరోధకంగా మారిందని ప్రజలు నిర్మొహమాటంగా చర్చించుకుంటున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు
