అగ్నిధార న్యూస్ ,పెద్దపెల్లి జిల్లా: :మహిళలందరూ ఆర్థికంగా స్థిర పడాలి ఎమ్మెల్యే కోరు కంటి చందర్

రామగుండం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మహిళలందరికీ స్వయం ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్  అన్నారు.ఆదివారం  17 వ డివిజన్ 8వకాలనీ లో విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళాలకు ఉచిత కుట్టుమిషన్ కేంద్రాన్ని  ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రతి పేద మహిళను కుటుంబ పోషకురాలిగా మార్చాలన్నదే తమ ధ్యేయమని అన్నారు.రామగుండం కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లలో విజయమ్మ ఫౌండేషన్ ద్వారా కార్పొరేషన్ ఒక్కొక్క డివిజన్ కి రెండు కుట్టు మిషన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.మహిళలంతా ఈ  సదవకాశాన్ని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు శిక్షణ ఆత్మస్థైర్యానికి ఆర్థిక ఎదుగుదలకు దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పోరేట్ సాగంటి శంకర్ ,విజయమ్మ ఫౌండేషన్ నిర్వాహకులు, ఏడేల్లి శ్యామ్ నాయకులు మధుకర్ రెడ్డితో పాటు మహిళలు పాల్గొన్నారు..