అగ్నిధార న్యూస్ పెద్దపల్లి

వరిదాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే దాసరి

పెద్దపల్లి మండలం ముత్తారం గ్రామం లో DCM ద్వారా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని  ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. పండించిన పంటను నేరుగా కేంద్రాల వద్ద కి తీసుకువచ్చి అమ్ముకునే  విధంగా వెసులుబాటు ప్రభుత్వం కల్పించిందన్నారు రైతులకు  కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి అసౌకర్యాలు లేకుండా కేంద్ర నిర్వాహకులు చూడాలన్నారు పండించిన  చివరి గింజ రైతు అమ్ముకునే అంతవరకు కొనుగోలు కేంద్రాలు పని చేస్తాయన్నారు  కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుమారస్వామి ఎంపీపీ బండారి స్రవంతి-శ్రీనివాస్, ఉప సర్పంచ్ చేలుకల సంపత్, వార్డ్ సభ్యులు, సెంటర్ ఇంచార్జి ఉపేందర్ రెడ్డి నాoసాని రాజయ్య  గ్రామ రైతులు   ప్రజలు  పాల్గొన్నారు