అగ్నిధార న్యూస్, పెద్దపల్లి జిల్లా:

ఆదివారం రోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తన నివాసం వద్ద మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు  విలేకర్ల సమవేశం ఏర్పాటు చేశారు. సందర్భంగా ఆయన మట్లాడుతూ…..తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి , పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ,  యాసంగిలో రైతులు  వరి ధాన్యము పండిస్తే ప్రభుత్వం కొనుగోలు చేయమని ఎవరైనా రైతులు సాగు చేస్తే వారి కర్మకు వారే అమ్ముకోవాలని ప్రభుత్వంలో ఉన్న మంత్రులు మాట్లడటం దురదృష్టకరమన్నారు.సుమారు లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించామని గొప్పలు చెపుతున్న తెరాస ప్రభుత్వం ఇపుడు రైతులను యాసంగి సాగులో వరి ధాన్యము వెయ్యొద్దని,కొనము అని చెప్పడం ఎంత వరకు సమంజసం అన్నారు. రాష్ట్రంలో ఉన్న బిజెపి నాయకులు మాత్రం యాసంగి సాగులో వరి ధాన్యం వెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా కొనుగోలు చేయిస్తామనిచెపుతుంటె కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బిజెపి మంత్రులు మోడీ బయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం ) కొనుగోలు చెయ్యమని కేంద్ర వ్యవసాయ అదికారులు దేశంలో ఉన్న రాష్ట్రాలకు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా రైతులకు సూచన చేయాలని రాష్ట్రాలకు దిశా నిర్దేశం చేశారని తెరాస మంత్రులు చెప్పడం చూస్తుంటే రైతుల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద వైఖరిని అవలంబిస్తూ ఒకరిపై ఒకరు చౌకబారు ఆరోపణలు చేసుకుంటూ రైతులను మోసం చేస్తూ మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యాసంగి సాగులో వరి ధాన్యం కొనుగోలుపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.లేని పక్షములో కాంగ్రెస్ పార్టి ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా పోరాటం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచైనా సరే వరి ధాన్యం కొనుగోలు చేయిస్తామని అన్నారు .
ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ కౌన్సలర్ నూగిల్ల మల్లయ్య, భూతగడ్డ సంపత్,నేతట్ల కుమార్,తాడూరి శ్రీమాన్,,సురేష్ గౌడ్, సర్వర్ పాషా, బొడ్డుపల్లి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.