అగ్నిధార న్యూస్, పెద్దపల్లి:
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న కళా వృత్తి వ్యాయామ ఉపాధ్యాయుల ముఖ్య సమావేశం నిర్వహించారు. కోవిడ్ కారణంగా గత కొన్ని నెలలు గా నుండి విధుల నుండి తొలగించి, 20 నెలల తర్వాత నియామకం అయిన తర్వాత ఈ సమావేశం నిర్వహించారు. రీఎంగేజ్ ఆర్డర్స్ ను ఇచ్చి మా జీవితాలలో వెలుగు నింపిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే ప్రభుత్వం తో చర్చలు జరిపి రీఎంగేజ్ ఆర్డర్స్ ఇప్పించిన M.L.C లు కాటెపల్లి జనార్దనరెడ్డి , కూర రఘోత్తమ్ రెడ్డి , మాజీ M.L.C పూల రవీందర్ లకి , PRTU రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్ రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్ రావులకు కృతజ్ఞతలతలు తెలిపారు. తదనంతరం నూతన జిల్లా కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. అధ్యక్షులు గా.పెండేటసత్యం.గర్రెపల్లి. కార్యదర్శి. నాగరాజు.పెద్దపల్లి ఉపాధ్యక్షులు.కె.సంధ్యరాణి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో కొల్లూరి శ్రీనివాస్ పిల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
