అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి:  మంగళవారం ఆజాదే కా అమృత్ మహోత్సవంలో భాగంగా నల్సా న్యాయ సేవా ఉత్సవాలను పురస్కరించుకుని మండల న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో మండలం లోని గట్టేపల్లి గ్రామంలో అవరణలో న్యాయ విఙ్ఞాన సదస్సు నిర్వహించారు.ప్రజలకు న్యాయ సహాయం అందించేందుకు మండల న్యాయ సేవాదికార సంస్థ ముందుంటుందని సుల్తానాబాద్ మున్సిఫ్ కోర్ట్ జూనియర్ సివిల్ జడ్జి పార్థసారథి రావు అన్నారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు జాతీయ న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో అక్టోబర్ 2 నుండి నవంబర్ 14 వరకు గ్రామగ్రామాన న్యాయ సేవా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. న్యాయవ్యవస్థను ప్రజల వద్దకు తీసుకువెళ్లి న్యాయ సహాయం అందించడానికి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. న్యాయ సహాయం పొందాలనుకునే వ్యక్తులు మండల న్యాయ సేవాధికార సంస్థ ను సంప్రదించినట్లయితే తగిన న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు.  న్యాయవాదులు వివిధ చట్టాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వోడ్నాల రవీందర్, ప్రధాన కార్యదర్శి నేరేళ్ళ శంకర్, ఏజిపీ మేకల తిరుపతి రెడ్డి, ప్యానెల్ న్యాయవాది అవునూరీ సత్యనారాయణ, న్యాయవాదులు పబ్బతి లక్ష్మికాంతరెడ్డి, అకారపు సరోత్తమ్ రెడ్డి, జోగుల రమేష్, సామల రాజేంద్రప్రసాద్, జి. గోపినాథ్, సర్పంచ్ కొలిపాక అరుణజ్యోతి పెద్దన్న, ఎంపిటిసి శీలం శంకర్, ఉపసర్పంచ్ పసుల నిర్మల రాజారాం, పారా లీగల్ వాలంటీర్ శ్రీలత, వార్డు సభ్యులు, అంగాన్ వాడీ, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు