అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి క్రైమ్:

నిషేదిత పొగాకు ఉత్పత్తులు పట్టుకొన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.

పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి కేంద్రం లోని అమర్ నగర్లో శబరి కిరాణంలో నిషేదిత పొగాకు ఉత్పత్తులు అమ్ముతున్నారు అనే, నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్,సిబ్బంది చంద్రశేఖర్, సునీల్ రవి తో కలిసి పెద్దపల్లి పట్టణం లో శబరినాథ్ అను అతని షాప్ లో తనిఖీ చేయగా రూ: 64,400 రూపాయల విలువ గల ప్రభుత్వ నిషేదిత పొగాకు ఉత్పత్తులు లభించాయి. వాటిని స్వాధీనం చేసుకొని షాప్ యజమాని అయిన పెద్ది శబరినాథ్ s/o సుధాకర్,32yrs, వైశ్య R/o, పెద్దపల్లి ని అదుపు లోనికి తీసుకుని ఇట్టి నిషేదిత పొగాకు ఉత్పత్తులు ఎక్కడ నుండి ఎవరు సరఫరా చేశారు అని ఆరా తీయగా సునీల్ శర్మ, ఆదిత్య కిరాణం, మంచిర్యాల అనునతడు సరఫరా చేశాడు అని తెలపడం జరిగింది. పెద్దపల్లి S I రాజేష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.