అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి:

పెద్దపల్లి జిల్లా మంథిని నియోజకవర్గంలో కొందరు అధికారులు అధికార పార్టీ నేతల మౌలిక ఆదేశాలను పాటిస్తూ పనులెలా చేపడతారని జిల్లా కాంగ్రెస్ నేతలు నిలదీస్తున్నారు. రాజ్యాంగబద్దంగా తగిన లిఖిత పూర్వక ఆదేశాలతో పనులు కొనసాగించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గాండ్ల మోహన్ సూచించారు. అధికార పార్టీ నాయకుల మాటల మేరకు వారికి లబ్ది చేకూరేలా పనులు చేపడితే పై అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. లిఖితపూర్వకంగా లేని పనులు చేపడితే సంబంధిత కాంట్రాక్టర్లు నష్టపోయే అవకాశం ఉందన్నారు .జిల్లా పరిషత్ చైర్మన్ కమాన్ పూర్ ప్రాంతం నుండి పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా ప్రాతినిథ్యం వహిస్తున్నారు అన్నారు. జిల్లా అభివృద్ధి తో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రజల అభివృద్ధిని తాము కోరుకుంటున్నామని, అభివృద్ధిని అడ్డుకోబోమన్నారు. కమాన్ పూర్ లో ఆసుపత్రి మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ఎలా కడతారు అని ప్రశ్నించారు .గతంలో ఇచ్చిన హామీ మేరకు 30 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని అన్నారు. కమాన్ పూర్ అభివృద్ధికి ఇచ్చిన హామీలను నిలుపుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కమాన్ పూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజయ్య కాంగ్రెస్ పార్టీ మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు తిరుపతి నాయకులు రవి కనకయ్య రాజయ్య యూసఫ్ రవి అప్సర్ తదితరులు పాల్గొన్నారు