అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ.

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి
రంజాన్ పండుగను పురస్కరించుకొని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం పలువురు అధికారులు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, ఆర్డీవో శ్రీనివాసరావు, పలువురు జిల్లా అధికారులు, ఇతర మండలాల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.