అగ్నిధార రిపోర్టర్ కలవేన రాము
అగ్నిధారన్యూస్ పెద్దపల్లి// సుల్తానాబాద్ రూరల్
పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం సబితం గ్రామపంచాయతీ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ ఈ రమేష్ గ్రామంలో ఉపాధి హామీ పథకంలో అనేక అవకతవకలకు పాలు పడుతున్నాడు అంటూ పనిచేయని వారికి హాజరు వేస్తూ సగం సగం కూలీల సొమ్మును తీసుకుంటున్నట్లు ఆరోపిస్తూ అదే గ్రామానికి చెందిన, గుమ్మడి మారుతి సోమవారం పెద్దపల్లి జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కాళీoదిని కి ఫిర్యాదు చేశాడు. తన ఫిర్యాదులో ఫీల్డ్ అసిస్టెంట్ ఉపాధి హామీ పథకంలో అనేక అక్రమాలకు తెర లేపాడని పేర్కొన్నాడు. పథకం నిబంధనలకు విరుద్ధంగా కూలీలతో పనిచేపిస్తూ, నిధులను దుర్వినియోగ పరుస్తూ ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టిస్తున్నాడంట ఆరోపించాడు. ఉపాధి హామీ కూలీలను గ్రామంలో జరిగే ఒక కాంట్రాక్ట్ పనిలో ఉపాధి కూలీలతో పని చేయిస్తూ సొమ్ము చేసుకుంటు ఉపాధి హామీ ఆశయానికి గండి కొడుతున్నాడంటూ ఫిర్యాదు చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ రమేష్ పైన సమగ్ర విచారణ చేపట్టి శాఖ పరమైన చర్యలు చేపట్టాలని ఫిర్యాదులు పేర్కొన్నాడు ఆయన వెంట శ్రీరాముల సాయి తదితరులు ఉన్నారు.
