అగ్నిధారన్యూస్ తెలంగాణ
ముంబై మహానగరంలో “పార్లే బంగారు బతుకమ్మ మండల్” ఆధ్వర్యంలో శ్రీపరభావ నామ ఉగాది నూతన సంవత్సరం పురస్కరించుకొని మహిళలు పసుపు కుంకుమ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఇందిరానగర్ చాల్ నం:2లో నివసించే తెలుగు మహిళలు ఇతరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా విలేపార్లే వార్డ్ నం:70 నగర్ సేవక్ అనీష్ నవల్ మక్వాని హాజరైయ్యారు. ఈ సందర్భంగా అనీష్ మాట్లాడుతూ మహిళలకీ గుడిపాడ్వా ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెల్పారు. ప్రజలందరు కుటుంబ సభ్యులతో సు:ఖ సంతోషాలతో ఉండాలని కోరారు. తెలుగువారి ఉగాది కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. పసుపు కుంకుమ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక స్త్రీలతోపాటు చుట్టూ ప్రక్కన ఇందిరా నగర్ తదితర ఏరియాల్లో నివసించే స్త్రీలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. అలాగే స్థానిక ప్రముఖ రాజకీయ నాయకులైన హేమంగ్ జంగల, చిత్రేష్ మూలాజీ, తప్పన్ మేత తదితరులు పాల్గొని మరింత శోభను పెంచారు.
