జిల్లా కేంద్రంలో గోల్డ్ చైన్ లభ్యం.

అగ్నిధారన్యూస్ ,(పెద్దపల్లి):
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్, ఎల్లమ్మ చెరువు కట్ట వద్ద ఈనెల 25.. సాయంత్రం దాదాపు 8:30 సమయంలో కుటుంబంతో కలిసి పెద్దపల్లి మండలం కాసులపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి అహ్మద్ షేక్‌కు స్థానిక ట్యాంక్ బండ్ ను చూడడానికి వెళ్లగా పిల్లలు ఆడుకునే ప్రాంతంలో ఒక గోల్డ్ చైన్ ( నల్లపూసల గొలుసు ) అహ్మద్ షేక్‌కు దొరికింది. గోల్డ్ చైన్‌ను భద్రత దృష్ట్యా పెద్దపల్లి పట్టణ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్ శ్రీనివాస్ వద్ద ఉంచినట్లు అహ్మద్ షేక్‌కు తెలిపారు. గోల్డ్ చైన్ యజమానులు సరైన గుర్తింపుతో పోలీస్ స్టేషన్ కానీ, అహ్మద్ షేక్‌ను 9642929925 నంబర్ ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు…