లోక్ అదాలత్‌ విజయవంతంలో పోలీసుల కృషి గొప్పది.

జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల 

ప్రతిభ కనబరిచిన అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేత.

పాల్గొన్న పెద్దపల్లి డీసీపీ భూక్యరామ్ రెడ్డి.

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి జిల్లా, జిల్లాలో లోక్ అదాలత్‌ ద్వారా కేసులు చేయడానికి ఒక చక్కటి మార్గమని, రాజీమార్గమే రాజీమార్గం అంటూ ప్రజలకు పోలీస్ యంత్రాంగం వివరించడంలో విజయం సాధించారు. ఆదిశగా ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడంలో పెద్దపల్లి జిల్లాలో పనిచేస్తున్న క్షేత్రస్థాయి నుంచి ఉన్నత పోలీసు అధికారులు,సిబ్బంది ప్రదర్శించిన చొరవ అభినందనీయమని పెద్దపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. మార్చి నెలలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన జిల్లాలోని పోలీస్ అధికారులకు బుధవారం ఆమె అభినందిస్తూ, ప్రశంసా పత్రాలను అందించారు.

సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ...

ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసులను కక్షిదారుల మధ్య పరస్పర అవగాహన కల్పించడంలో, సమస్యలను పరిష్కరించడం కోసం ఇరు వర్గాలకు కౌన్సిలింగ్ నిర్వహించి, రాజీమార్గంలో కేసులను పరిష్కరించుకోవడం కోసం పోలీస్ శాఖ యంత్రాంగం శక్తివంచన లేకుండా చిత్తశుద్ధితో కృషి చేశారన్నారు.న్యాయ వ్యవస్థతో సమన్వయం పాటిస్తూ,బాధితులకు సత్వర న్యాయం చేకూరేలా పోలీసులు లోక్ అదాలత్ విజయవంతం అవ్వడానికి పాటుపడ్డారని కొనియాడారు.ఇదే నిబద్ధతను భవిష్యత్తులోనూ కొనసాగించాలని ఆమె సూచించారు.

ఈ సందర్భంగా పెద్దపల్లి డీసీపీ భూక్యరామ్ రెడ్డి మాట్లాడుతూ…

న్యాయస్థానం పోలీసు విభాగాల మధ్య ఉన్న అనుసంధానం లోక్ అదాలత్ ద్వారా జిల్లాలో భారీ సంఖ్యలో కేసులు పరిష్కారం కావడానికి నిదర్శనం అని తెలిపారు. పోలీస్ శాఖ కృషిని గుర్తించి గౌరవించినందుకు న్యాయశాఖకు, అలాగే జిల్లా న్యాయమూర్తి సునీత కుంచాలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా జిల్లా ఫోక్సో కోర్టు న్యాయమూర్తి కె.స్వప్న రాణి,జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి వి.భవాని, జూనియర్ సివిల్ జడ్జి ఎన్.మంజుల,పెద్దపల్లి ఏసీపీ జి.కృష్ణ, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్,,పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్, మంథని సీఐ రాజు, ఎస్ ఐలు ,కోర్టు కానిస్టేబుళ్లు,పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.