ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
అగ్నిధారన్యూస్ పెద్దపల్లి, మే-04
పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో రికార్డ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న కె. చిరంజీవిని సస్పెండ్ చేస్తూ *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* ఉత్తర్వులు జారీ చేశారు.
కె. చిరంజీవి విధులకు గైర్హాజరు కావడం ఫోన్ కాల్స్‌కు స్పందించకపోవడం, వివరణ కోరుతూ జారీ చేసిన మెమోలను స్వీకరించకపోవడం ఉద్యోగ విధుల పట్ల తనకున్న నిర్లక్ష్యానికి సస్పెన్షన్ కి కారణంగా తెలుస్తుంది.
ఇదే విషయంపై కమాన్‌పూర్ తహసీల్దార్ నివేదిక అందడంతో, సంబంధిత ఉద్యోగిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నట్లు గుర్తించినట్లు కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, శాఖాపరమైన విచారణ చేపట్టనున్న నేపథ్యంలో, ఎ.పి. సివిల్ సర్వీసెస్ (సీసీఏ) నిబంధనల ప్రకారం చిరంజీవిని సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.
సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుండి అమల్లో ఉంటాయని, విచారణ పూర్తయ్యే వరకు కొనసాగుతాయని తెలిపారు. సస్పెన్షన్ కాలంలో సంబంధిత ఉద్యోగి ముందస్తు అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్స్‌ను వీడరాదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
