ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ధాన్యం కొనుగోలు కేంద్రం వివాదం.

24 గంటల్లో సంజాయిషీ ఇవ్వాలి.

జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు పర్శవేణి శ్రీనివాస్.

         అగ్నిధారన్యూస్ పెద్దపల్లి క్రైమ్
పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చినట్టుగా ఉంది, పెద్దపల్లి జిల్లా, పాలకుర్తి మండలం, పాలకుర్తి గ్రామంలో కాంగ్రెస్ పార్టీలో ముదిరిన ఆధిపత్య పోరు కాస్త పాలకుర్తి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కి కాంగ్రెస్ పార్టీ నుండి ఎందుకు సస్పెండ్ చేయకూడదు చెప్పాలంటూ…. 24 గంటల డెడ్ లైన్ పెట్టి షోకాస్ నోటీసు ఇవ్వడం రామగుండం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. గ్రామస్థాయి వివాదం కాస్త జిల్లా స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం బసంత నగర్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్శవేణి శ్రీనివాస్, పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముక్కెర శ్రీనివాస్, పాలకుర్తి గ్రామ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు…. పాలకుర్తి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పెద్దపల్లి తిరుమల ఇటీవల గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ( పిఎసిఎస్ )ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహణ విషయంలో వచ్చిన ఆరోపణలవల్ల కాంగ్రెస్ పార్టీకి జరిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ నుండి ఎందుకు సస్పెండ్ చేయకూడధొ వివరణ ఇవ్వాలంటూ ఆదేశించారు.

సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మెరుగు అశోక్ మాట్లాడుతూ… గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలతో కలిసి పని చేయాల్సిన సర్పంచ్, తన గెలుపు కోసం కృషిచేసిన వారిపైనే కక్షపూరితమైన వైఖరితో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైనే తన అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్నారన్నారు. అధిష్టానం ఆదేశాలను ధిక్కరిస్తూ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతుందన్నారు. గ్రామ ప్రజలు, కార్యకర్తలమంతా కష్టపడి గెలిపించుకుంటే అవినీతి ఆరోపణలతో పరిపాలన సాగించడం కాంగ్రెస్ పార్టీకి తీవ్రం నష్టమని ఆవేదన వ్యక్తం చేశారు.

సర్పంచ్ పై ఆరోపణలు

గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకురాలిగా పనిచేస్తున్న నగునూరి జ్యోతి, సర్పంచ్ పెద్దపల్లి తిరుమల పై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు. గత రెండు సీజన్లుగా పాలకుర్తి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎలాంటి అవినీతి, అక్రమాలు, లేకుండా రైతుల సంక్షేమం కోసం రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. పాలకుర్తి గ్రామ రైతులలో నాపై నాకుటుంబం పై వస్తున్న ఆదరణను చూసి ఓర్చుకోలేక సర్పంచ్ అనే అధికార దర్పంతో కొంతమంది తన తొత్తులను ధాన్యం కొనుగోలు కేంద్రం వద్దకు పంపించి నన్ను నా భర్తను మానసికంగా వేధించడమే కాకుండా భౌతిక దాడులకు దిగడానికి ప్రయత్నం చేశారన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నిర్వహిస్తున్న నన్ను 50వేల రూపాయలు లంచం డిమాండ్ చేశారన్నారు. అడిగిన డబ్బులు ఇవ్వకపోవడంతో కక్షగట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీలో నిబంధనలకు విరుద్ధంగా నిధులు డ్రా చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. త్వరలోనే ఆధారాలతో ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గంగాధరి రమేష్, నూకల గట్టయ్య, రాజమౌళి, బ్రహ్మం, సంజన, సాగర్, ఒడ్నాల రాజు, దేవ భారతి, అంజయ్య, లక్ష్మయ్య, పాల్గొన్నారు.