SC/ST కేసులతో బెదిరింపులు..బాధితుల ఆవేదన.
మూడు తరాల భూమికి రక్షణ లేదు…?
JCBతో దౌర్జన్యం
బాధితుల ఆరోపణ.
అగ్నిధారన్యూస్ పెద్దపల్లి
పెద్దపల్లి పట్టణంలోని ఆర్కే గార్డెన్ లో గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి…
తమ మూడు తరాల పూర్వీకుల భూమిని కొందరు అక్రమంగా లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా,పెదకలవల గ్రామానికి చెందిన చెలుకల ఐలయ్య, శ్రీనివాస్, దుర్గయ్యలు మాట్లాడుతూ...
పెద్దపల్లి పట్టణానికి చెందిన కొలిపాక శ్రీనివాస్, కొలిపాక చిరంజీవి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారులు వారి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అడ్డంగా ఉందని గత కొంతకాలంగా , తమ వ్యవసాయ భూమిని అమ్మాలి అంటూ వేధిస్తున్నారని ఐలయ్య అన్నారు. తనతోపాటు తన కొడుకు చెలుకల శ్రీనివాస్, మనుమడు చెలుకల మనోజ్ లపైన తమకు తెలియని ఎస్సీ కులానికి చెందిన వారిచే SC/ST అక్రమ కేసు పెట్టించారని భూ బాధితులు శ్రీనివాస్ ,దుర్గయ్య, ఐలయ్య ఆవేదన వ్యక్తం చేశారు . అంతేకాదు, రాత్రికి రాత్రి జెసిపి, టిప్పర్లతో భూమికి సంబంధం లేని వారితో తమ భూమిలోకి మట్టిని తరలిస్తూ రోడ్లు వేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు,అన్నారు.
బాధితుల పక్షాన యాదవ సంఘం అండగా ఉంటుంది అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు మేకల మల్లేశం యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేందర్ యాదవ్ మాట్లాడుతూ…పెద్దపల్లి పట్టణానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొలిపాక శ్రీనివాస్ చిరంజీవి లు, తమ స్వప్రయోజనాల కోసందళితులను ఉసిగొల్పి కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
వ్యాపారం చేసుకోవాలి కానీ, ఇలా దౌర్జన్యం చేయడం సరికాదని అన్నారు.యాదవ కులం ఎప్పుడూ కులాలకు మతాలకు అతీతంగా అందరినీ కలుపుకుపోయే జాతి అని అన్నారు, యాదవులు కోపతాపాలకు పోయే ప్రసక్తే లేదన్నారు. కానీ కొందరు కులం పేరుతో వెనక ఉండి ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు అండగా కులం నిలుస్తుంది అన్నారు.
ఈ విషయంలో పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, నిజానిజాలు నిగ్గు తేల్చి, మూడు తరాల భూమికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా సమస్యను సర్దుమనిగేల పరిష్కార మార్గం చూపాలన్నారు. లేనట్లయితే తెర వెనక కథ నడుపుతున్న వారి భరతం పడతామని బాధితుల పక్షాన అండగా ఉంటామని సంఘ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు పెగడ రమేష్ యాదవ్ మాజీ ఉప సర్పంచ్ సంతోష్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
