అగ్నిధార న్యూస్, ఆదిలాబాద్:

గుండెపోటు తో యువకుడి మృతి…

ఇచ్చోడ మండలం జామిడి గ్రామంలో మంగళవారం రోజు విషాదం చోటుచేసుకుంది . గాయిక్వాడ్ ప్రవీణ్ అనే 32 ఏళ్ల యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. రోజు వ్యవసాయ కూలిగా పని చేస్తూ కుటుంబ భారం మోస్తున్నా ప్రవీణ్ మంగళవారం రోజు ఉదయం ఛాతీలో నొప్పిగా ఉందని కుటుంబ సభ్యులకు తెలపడంతో, హుటాహుటిన అంబులెన్స్ లో రిమ్స్ ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గ మధ్యలో మృతిచెందాడు. మృతునికి భార్య …… మరియు నలుగురు కూతుర్లు ఉన్నారు.  భార్య రోధిస్తున్న తీరు చూసి గ్రామంలోని ప్రజలందరూ కంటతడి పెట్టుకున్నారు. చిన్న పిల్లలకు తమ తండ్రికి ఏమయిందో తెలియక , అక్కడికి వస్తున్న జనాల్ని అమాయకంగా చూస్తున్న చిత్రం ప్రతి ఒక్కరినీ కలిచి వేసింది. గ్రామంలో అందరితో కలివిడిగా ఉండే ప్రవీణ్ ఒక్కసారిగా హఠాన్మరణం పొందడంతో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.