అగ్నిధార న్యూస్, పెద్దపల్లి:
ఘనంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు పాల్గొన్న ,మహిళా జిల్లా కన్వీనర్ కుమ్మరి సవిత.
డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉద్యోగానికి రాజీనామా చేసి బి ఎస్ పి పార్టీ లో చేరిన అనంతరం రాష్ట్ర పార్టీ కోఆర్డినేటర్ హోదాలో మొదటిసారి జన్మదిన వేడుకలు జరగడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయన అనుచరులు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు . ఈ క్రమంలో పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి కేంద్రంలో బస్టాండ్ సమీపంలో గల బి ఎస్ పి జిల్లా కార్యాలయంలో జిల్లా పార్టీ కార్యకర్తల హడావిడి మధ్య ఘనంగా కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో BSPజిల్లా అధ్యక్షుడుతో పాటు జిల్లా మహిళా కన్వీనర్ కుమ్మరి సవిత ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో డి.ఎస్.పి పార్టీ బలోపేతానికి అందరు కలిసి కట్టుగా కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో పెద్దపల్లి BSP పార్టీ ఆఫీస్ ఇంచార్జి గడ్డం.శేషాద్రి,పెద్దపల్లి అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి ములుమూరి శేఖర్, పెద్దపల్లి టౌన్ అధ్యక్షులు చిప్పకుర్తి శంకర్, సుల్తానాబాద్ మండల అధ్యక్షులు బోయిని రంజిత్, పెద్దపల్లి మండల అధ్యక్షులు తిరుపతి పటేల్, పెద్దపల్లి నియోజకవర్గం ఉపాధ్యక్షులు దుర్గయ్య, పెద్దపల్లి అసెంబ్లీ ఇంచార్జి కల్వ వల శ్రీనివాస్, పెద్దపల్లి రజిత, పార్టీ నాయకులు తదితరులు పాలుగోన్నారు.
