:వోల్లాల జలంధర్ గౌడ్ అగ్నిధారన్యూస్, జగిత్యాల :
జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండల కేంద్రానికి చెందిన కత్తెర్ల వసంత్ కుమారుడు, మనోజ్ స్థానికంగా డిగ్రీ చదువుతున్నాడు. కంటి సంబంధిత వ్యాధితో బాధపడుతూ (ఈల్స్ డిసీజ్) అకస్మాత్తుగా కంటి చూపు కోల్పోయిన జీవితం అందకారమైన పరిస్థితి ఏర్పడింది, ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే, ఆర్థిక ఇబ్బందులతో చికిత్స చేసుకుని పరిస్థితుల్లో ఉండి స్థానిక వైస్ యం.పి.పి ఆవుల సత్తయ్య ఈరోజు పరిస్థితి కుటుంబ పరిస్థితి వివరించగా అవును సత్తయ్య వెంటనే సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు తెలుపగా మంత్రి తక్షణమే స్పందించి, కేరళ ఆయుర్వేద వైద్యశాలలో చికిత్సకు 2 లక్షల ఎక్స్ గ్రేషియా మంజూరు చేసి, గురువారం హైదరాబాద్ క్యాంపు కార్యాలయంలో చెక్కును లబ్ధిదారునికి అందించడం జరిగింది. ఈ సందర్భంగా మనోజ్ కుటుంబ సభ్యులు మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన మేలు జన్మజన్మల మర్చిపో మన్నారు. మనోజ్ కు పునర్జన్మను ప్రసాదించిన మంత్రి కృతజ్ఞతలు తెలిపారు .
