అగ్నిధారన్యూస్ ( మంచిర్యాలజిల్లా ): రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ చంద్ర శేఖర్ రెడ్డి   ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల జిల్లా కేంద్రంలోనీ ఆర్.పి రోడ్ లోనీ ఒక ఇంటి ఆవరణలో డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతున్నారు అనే ,నమ్మదగిన సమాచారం మేరకు , టాస్క్ ఫోర్స్ సీఐ ఏకే మహేందర్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ లచ్చన్న మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బందితో కలసి పేకాట స్థావరం పై ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 05 గురు పేకాటరాయుళ్ళు,  వారి వద్ద నుండి పేకముక్కలు,  73,070/- రూపాయల నగదు 04 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకునీ, తదుపరి విచారణ నిమిత్తం మంచిర్యాల పోలీసు అప్పగించారు.
పేకాట ఆడుతూ పట్టుబడ్డ నిందితుల వివరాలు..

గోపాల్ s/o. ఓమ్ ప్రకాష్,                         వయస్సు:38, వృత్తి: వ్యాపారం,
   నివాసం: మంచిర్యాల.

ఆర్.యోగేష్ s/o. నంద కిషోర్                 వయస్సు:38, వృత్తి: వ్యాపారం,
   నివాసం: మంచిర్యాల.

ఐ.రాకేష్ s/o. కమల్ కిషోర్ ,                   వయస్సు:36, వృత్తి: వ్యాపారం,
   నివాసం: మంచిర్యాల.                                        

జాజు రామ్ s/o. ఓమ్ ప్రకాష్,                  వయస్సు:35, వృత్తి: వ్యాపారం,
   నివాసం: మంచిర్యాల…

ఆర్.గోపాల్ s/o. బి.ప్రసాద్                     వయస్సు:36, వృత్తి: వ్యాపారం,
   నివాసం: మంచిర్యాల.

అనుమతులు లేని అక్రమ వ్యాపారాలు, కోళ్ల పందాలు,  క్రికెట్ బెట్టింగ్,  గేమింగ్ , నకిలీ విత్తనాలు, గంజాయి, గుట్కా , మట్కా వంటి చట్టవ్యతిరేక  చీకటి ,  అక్రమ వ్యాపారాలు  నిర్వహించే వారిపై ఎప్పుడూ టాస్క్ ఫోర్స్ నిఘా ఉంటుందని , హెచ్చరించారు  ఇకముందు కూడా  వరుస దాడులు ఉంటాయని ,  టాస్క్ ఫోర్స్ సిఐ ఏకే. మహేందర్ తెలియ జేశారు.ఈ టాస్క్ లో పాల్గొన్నవారు , మంచిర్యాల ఎస్ ఐ కిరణ్,
టాస్క్ ఫోర్స్ సిబ్బంది సంపత్ కుమార్,భాస్కర్ గౌడ్  ఉన్నారు.