చేపల వేటకు వెళ్లి కుంటలో పడి మత్స్యకారులు మృతి.
అగ్నిధారన్యూస్ ( కాల్వశ్రీరాంపూర్ ).. చేపల వేటకు వెళ్లి కుంటలో పడి మత్స్యకారుడు మృతి చెందిన సంఘటన కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పందిళ్లలో చోటు చేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు, పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం పందిళ్ళ గ్రామానికి చెందిన కొండిళ్ళ మధు45 బుధవారం మధ్యాహ్నం చేపలు పట్టేందుకు  కుంటవద్దకు వెళ్ళాడు. వెళ్లిన వ్యక్తి ఇంటికి రాకపోవడంతో. గురువారం గ్రామస్తులు, కుటుంబ సభ్యులు కుంట వద్దకు వెళ్లగా కట్ట పైన లుంగీ, షర్టు ,చెప్పులు కనిపించడంతో గ్రామస్తులు కుంటలో వెతికి మధు శవమును బయటకు తీశారు. శవమై ఉన్న మధు మృతదేహం చూసి మృతుని భార్య తో పాటు కుటుంబ సభ్యులు బోరున విలపించారు.  మృతునికి భార్య తో పాటు  ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఎస్ ఐ వేంకటేశ్వర్లు సంఘటనా స్థలానికి చేరుకొని  మృతుని భార్య స్వరూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.