అగ్నిధార న్యూస్( రామగుండం ):
రామగుండము పోలీస్ కమీషనర్ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి.ఐపీఎస్ ఆదేశాలమేరకు ఈరోజు టాస్క్ ఫోర్సు సిఐ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జోన్ ధర్మారం పోలీస్ స్టేషన్ పరిధిలోని నంది మేడారం గ్రామం ప్రాంతంలో డబ్బులు పందెంగా పెట్టుకుని పేకాట ఆడుతున్నారు అని నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజకుమార్, ఎస్ఐ లచ్చన్న సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీ నిర్వహించి అక్కడే ఉన్న ఆరుగురుని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 39,420 రూపాయల నగదు, 05 సెల్ ఫోన్ లు,పేకాట ముక్కలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకున్న వీరిని ధర్మారం పోలీస్ స్టేషన్ కి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. …… ………………పట్టుబడిన వారి వివరాలు
1) నేర్పట్ల మధు s/o నర్సయ్య,45yrs r/o కొత్తూరు
2) తాళ్ల నరసింహులు s/o మల్లయ్య,40yrs r/o నంది మేడారం
3) పులి శ్రీనివాస్ s/o రాజయ్య,30yrs r/o మల్లాపూర్
4) చిట్టీ మల్లు అజయ్ s/o రాజేశం 46yrs,r/o బోట్ల వనపర్తి
5) దామెర వివేక్ రెడ్డి s/o గంగా రెడ్డి,27yrs r/o ఆర్నకొండ
6) కొలిపాక రాజేశం s/o రాయమల్లు,40yrs r/o నంది మేడారం
ఈ సందర్భంగా సీఐ రాజ్ కుమార్ మాట్లాడుతూ…… తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు అనే అత్యాశకు పోయి చాలా మంది పేకాటకు బానిసలుగా మారుతున్నారు, అని అప్పుల్లో కూరుకు పోయి కుటుంబాలను రోడ్డుపాలు చేస్తున్నారన్నారు. పేకాట చట్టరీత్యా నేరం చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాలు పడినట్లయితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు .
ఇట్టి టాస్క్ లో, శ్రీనివాస్, చంద్ర శేఖర్, మహేందర్,ప్రకాష్ శ్రీనివాస్,భాస్కర్, మల్లేష్ సునీల్ పాల్గొన్నారు.
