అగ్నిధారన్యూస్, ( కాల్వ శ్రీరాంపూర్. ):శుక్రవారం కాల్వశ్రీరాంపూర్.. మండలంలోని 24 గ్రామ పంచాయతీలలో కమిటీగా ఏర్పడి గ్రామ గ్రామాన వైద్య సిబ్బంది ఫీవర్ సర్వే లు నిర్వహించారు. ఇంటింటికి సర్వే నిర్వహించి జ్వరం, దగ్గు, జలుబు ఉన్న వారికి మెడికల్ కిట్ అందజేశారు. ఐదు రోజుల కంటే ఎక్కువ ఫీవర్ ఉంటే గవర్నమెంట్ ఆసుపత్రి కి వెళ్లాలని ఏ ఎన్ ఎం లు సూచించారు. గ్రామ గ్రామాన సర్వే చేస్తూ వ్యాక్సిన్ సెకండ్ డోస్వేసుకొని వారికి ఇంటింటా తిరిగి వేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్, , మండల ప్రత్యేక అధికారి తిరుమల ప్రసాద్, ఎంపీడీవో రామ్మోహన్ చారి. డాక్టర్ ప్రవీణ్ , హెచ్ఈ వో శ్రీనివాస్ ఏ ఎన్ ఎం లు ఆశా లతోపాటు గ్రామ కార్యదర్శులు అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
