అగ్నిధారన్యూస్(  పెద్దపల్లి  ):పెద్దపల్లి మండలం భోజన పేట గ్రామంలో మురుగు కాలువల నిర్మాణం కొరకు మండల్ గ్రాంట్  15 ఫైనాన్స్ నిధుల నుండీ డ్రనేజి పనులకు శనివారం  గ్రామ సర్పంచ్ మేకల మల్లేష్ , mptc మేకల రాజేశ్వరి శ్రీనివాస్ కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 5 లక్షల రూపాయల మండల నిధులతో గ్రామంలోని పొన్నం రాజయ్య ఇంటివద్ద నుండి మేకల అంజయ్య ఇంటి వరకు మురుగు  కాలువ నిర్మాణ పనులు చేపట్టామన్నారు. గ్రామమౌలిక అవసరాల అభివృద్ధిలో భాగంగా డ్రైనేజ్ కాలువ నిర్మాణ పనులు చేస్తున్నామన్నారు ఈ ప్రాంతంలో నీరు నిలిచి పరిశుభ్రత కోరవడుతున్న దృశ్య నిర్మాణ పనులు చేపట్టామన్నారు ఈ కార్యక్రమంలో వాడు సభ్యులు స్థానిక ప్రజలు  పాల్గొన్నారు