అగ్నిధారన్యూస్ ( కాల్వశ్రీరాంపూర్ ): శనివారం రోజు స్థానిక మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో 2022 ఈ సంవత్సరం పి ఆర్ టి యు టి ఎస్ క్యాలెండర్ నుకాల్వ శ్రీరాంపూర్ ఎంపీపీ నూనేటి సంపత్ యాదవ్, జడ్పిటిసి వంగల తిరుపతిరెడ్డిలు పి ఆర్ టి యు టి ఎస్ ను క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యా మనిషికి గొప్ప ఆయుధం, విద్య మనిషిని ఉన్నత స్థానంలో నిలుపుతుంది, విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల కృషి ఆవిరామం అన్నారు. దేశంలో రాష్ట్రంలో క రో న విజృంభిస్తున్న దృశ్య విద్యార్థులు వ్యాధి బారిన పడకుండా ఉండుటకై రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించడం జరిగిందన్నారు. విద్యారంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో కట్టుబడి ఉంది అన్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎం ఈ ఓ ఆరెపల్లి రాజయ్య పిఆర్టియు మండల అధ్యక్షుడు కడారి నవీన్ పటేల్ సంఘ నాయకులు హరికృష్ణ గౌడ్, కర్ణ రాజు, కుమార్, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.
