అగ్నిధారన్యూస్( హైదరాబాద్ ): శనివారం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సీఎస్ సోమేష్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ లు, ఎస్సీ కార్పొరేషన్ జిల్లాధికారులతో దళిత బంధు పథకం పై. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 మంది లబ్దిదారులకు దళితబంధు అమలు చేయాలన్నారు. ఫిబ్రవరి 5 లోపు ప్రతి నియోజకవర్గంలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి కావాలి అన్నారు .మార్చి 7లోగా దళిత బంధు పథకం క్రింద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 మందికి లబ్ది చేకూర్చాలని రాష్ట్ర సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో  దళితుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్  ప్రత్యేకంగా తీసుకున్న కార్యక్రమం దళిత బంధని, దేశంలోనే ప్రత్యేకంగా దళితుల కోసం తీసుకున్న గొప్ప పథకం ఇది అన్నారు.  రాష్ట్రంలోని హుజరాబాద్ నియోజకవర్గం , వాసాలమర్రి గ్రామం మరియు మరో 4 మండలాలలో పూర్తిస్థాయిలో దళిత బంధు పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గ పరిధిలో  కనీసం 100 మంది  దళితులకు ఈ పథకం అమలు చేయాలని సీఎం నిర్ణయించారని మంత్రి తెలిపారు.ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాన్ని పూర్తి చేయుటకు గ్రౌండ్ లెవెల్ లో లబ్ధిదారులను ఎంపిక పూర్తి చేయాలన్నారు
దళిత బంధుతో నిరుపేద షెడ్యూల్ కులాల ఆర్థిక స్థితిగతులను మెరుగు పరచాల్సిన అవసరముందని,  జిల్లాలో దళిత బందు అమలుకు అవసరమైన కమిటీలు ఎర్పాటు చేసుకొని  కార్యాచరణ  రూపొందించుకోవాలని మంత్రి ఆదేశించారు.జిల్లా స్థాయిలో కలెక్టర్లు స్థానిక ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుని త్వరగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.నిరుపేద దళిత కుటుంబాలలోఆర్థికస్థితిగతులనుమెరుగుపరచడానికి  ప్రభుత్వం పది లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నందున, అందుకు తగిన పథకాలను రూపొందించి అమలు పరచాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ మాట్లాడుతూ అసెంబ్లీ నియోజకవర్గ హెడ్ క్వార్టర్ ఉన్న జిల్లా కలెక్టర్, సదరు అసెంబ్లీ ఉన్నతాధికారిని దళిత బంధు అమలు  ప్రత్యేక అధికారిగా నియమించాలనీ ఆదేశించారు.