కుల ఆచారాలను కాల రాయాలని చూస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తాం ఆవుల రాజేష్ యాదవ్
అగ్నిధార న్యూస్( రామగుండం ): రాష్ట్రంలో బండారి సంస్కృతిని కాల రాయాలనిచూస్తున్న దేవాదాయశాఖ”. ప్రభుత్వం నిర్ణయం వెనుకకు తీసుకోవాలని , లేనియెడల గొల్ల కురుమల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని రామగుండం కార్పొరేషన్ అఖిల భారత యాదవ మహాసభ కార్యనిర్వాహక అధ్యక్షులు ఆవుల రాజేష్ యాదవ్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొమురవెల్లి దేవస్థానం లో ఒగ్గు పూజ, సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం గా కొనసాగుతున్న తరుణంలో, ఒగ్గు సాంప్రదాయాలపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఎన్నో ఏళ్లుగా ఆలయంలో బొగ్గు పూజారులుగా కొనసాగుతూ ఉన్నారని కొమురవెల్లి మల్లన్న స్వామి మేలుకొలుపు ,పవళింపు సేవ మరియు మల్లికార్జున స్వామి కళ్యాణం పసుపు బండారి తో ఒగ్గు పూజారులు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నదని వారు అన్నారు , అలా కాకుండా ఆగమశాస్త్ర పద్ధతిలో అభిషేకాలు బిల్వార్చన కార్యక్రమాలు నిర్వహించడాన్ని గొల్ల కురుమలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, అనాదిగా వస్తున్న సంప్రదాయం ని కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. ఆగమశాస్త్ర పద్ధతిలో జరిపించాలని నిర్ణయాన్ని వారు తప్పుపట్టారు. దీన్ని ఎవరు అడ్డుకున్నా గొల్ల కురుమల ఆగ్రహానికి గురికాక తప్పదని ఇలాంటి నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆవుల రాజేష్ యాదవ్ డిమాండ్ చేశారు. దేవాదాయ శాఖ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆదివారం ఉదయం 11 గంటలకు గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని, నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు పాతపల్లి రవి కుమార్ యాదవ్ కార్యనిర్వాహక అధ్యక్షులు ఆవుల రాజేష్ యాదవ్ లు ఒక ప్రకటనలో తెలిపారు. యాదవ కుల బాంధవులు అందరూ కూడా అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు.
