అగ్నిధారన్యూస్.( తిరుపతిహెల్త్ ): ఎస్ వి వైద్య శాల రాష్ట్ర పే కమిషన్ పరిధిలోనే పిఆర్సి ఉంచాలని డిమాండ్ చేసిన ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ.గిరిబాబు, రాష్ట్ర సమితి పిలుపు మేరకు 5వ రోజు నల్ల బ్యాడ్జీలతో నిరసన చే పట్టిన శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల వైద్య ఉద్యోగులు ఈ సందర్భంగా ఉద్యోగులకు నష్టం కల్పించే పిఆర్సి జీవోలను రద్దు చేయాలని, రాష్ట్ర పరిధి పరిధిలోని పిఆర్సి వేతన సవరణలు జరగాలని , ప్రభుత్వం ఉద్యోగులకు న్యాయం పరమైన సమస్యలు పరిష్కరించాలని సమస్యలను జటిలం చేయరాదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు,కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని జీవితకాలమంతా తక్కువ వేతనంతో పనిచేస్తూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారి పదవీ విరమణ తరువాత ఏటువంటి పెన్షన్ భరోసా లేనందువలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు పరిచి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు.పి ఆర్ సి స్ట్రగుల్ కమిటీ నాయకులు, తిరుపతి జేఏసీ చైర్మన్ ఎస్. సురేష్ బాబు మాట్లాడుతూ రేపు చిత్తూరు కలెక్టరేట్ ర్యాలీ కార్యక్రమంలో క్యాజువల్ లీవ్ అప్లై చేసిఅందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఐక్యంగా పోరాడి మన సమస్యలను పరిష్కరించుకోవాలని లేనిపక్షంలో భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోతామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ కార్యదర్శి కే. సి.సుబ్రహ్మణ్యం, కోశాధికారి బాలసుబ్రమణ్యం, ఎన్జీవో కోశాధికారి ఎం శ్రీనివాసులు, అసోసియేట్ ప్రెసిడెంట్ బాలాజీ, ఏ. పి.ఎం. యూ, యూనియన్ నాయకులు గిరి కుమార్ ,హరిప్రియ ,భక్తవత్సలం, వెంకటపతిరాజు, మునిరత్నం, లోకేష్ ,మురళి ,రాజ్ కుమార్ , నాగమణి, నాగమ్మ, సుజాత , ఆర్.బీ. షీలా, తదితరులు పాల్గొన్నారు.