అగ్నిధారన్యూస్{( మంచిర్యాల ):రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి సి పి ,ఐజీగా పదోన్నతి పోందిన  సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ కు చెందిన  పోలీసు అధికారులు సోమవారం రోజున తన కార్యాలయంలో పుష్పాగుచ్చాలను అందజేసి, అభినందనలు తెలిపారు. అభినందనలు తెలిపిన వారిలో ఏఆర్ ఏసిపి సుందర్ రావు  ట్రాఫిక్ ఏసీపీ బాలరాజ్ లు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్ స్పెక్టర్లు విద్య సాగర్, సత్యనారాయణ, si రాజమౌళి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, గోదావరిఖని 1టౌన్ ఇన్స్పెక్టర్ లు రమేష్ బాబు, రాజ్ కుమార్, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ మహేందర్,ఆర్.ఐ మధుకర్, శ్రీధర్, సూపరింటెండెంట్ సందీప్, సిసి శ్రవణ్ కుమార్, మనోజ్,రామగుండం పోలీస్ సంఘం అధ్యక్షులు బోర్ల కుంట పోచలింగం, ఆర్ఎస్ఐ లు వున్నారు.