అగ్నిధారన్యూస్( పెద్దపల్లికలెక్టరేట్ ):పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి కలెక్టర్ రేట్ పరిధిలో ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ ప్రమోద్ కుమార్ కరోన కాల్ సెంటర్ ఏర్పాటు చేయించారు. తెలంగాణ రాష్ట్రంలో మూడో దశ కరోన విజృంభణ దృష్టిలో ఉంచుకొని ప్రజల సౌకర్యార్థం ఈ కాల్ సెంటర్ ని జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరుగుతుంది అన్నారు. కరోనా సోకిన వ్యాధిగ్రస్తులకు కరోన పైన అనుమానాలు ఉన్న వ్యక్తులకు,ఈ కాల్ సెంటర్ లో పలు సూచనలు సలహాలతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఫోన్ కాల్ చేసేవారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని, ఎర్రోజు మధుసూదన్ ,సదానందము తెలిపారు. మరింత సమాచారం కొరకు ఈ క్రింది కరోన కాల్ సెంటర్ నెంబర్లను సంప్రదించగలరు అన్నారు.
