అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి ): పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో, ఇటీవల కాలంలో కనుకుంట్ల స్వామి అనారోగ్య కారణాల వల్ల మృతి చెందగా,మృతుడి కుటుంబాన్ని శుక్రవారం రోజున పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం మాజీ ఎంపీ వివేక్ సందర్శించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనుకుంట్ల స్వామి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ స్వామి మృతి ఆ కుటుంబానికి తీరని లోటు అన్నారు. కనుకుంట్ల సదానందం కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు. ఎల్లవేళలా మృతుని కుటుంబానికి అండగా ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు బాలసాని సతీష్, పెరక వంశీ, సజ్జత్, అజయ్, హరీష్, తదితరులు పాల్గొన్నారు.
