అగ్నిధారన్యూస్(  పెద్దపల్లి  ):ఆదివారం రోజు పెద్దపల్లి మండలం అందుగుల్లపల్లి గ్రామంలో గౌడ సంఘ ఆధ్వర్యంలో, నిర్మించ తలపెట్టిన, శ్రీ రేణుక ఎల్లమ్మ గుడి, నిర్మాణ కి భూమి పూజ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి గౌడ కులస్తుల ఆరాధ్యదైవం అన్నారు. గ్రామంలో రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం నిర్మించడం, గొప్ప కార్యం అన్నారు. గ్రామ ప్రజలందరూ సు:ఖ సంతోషాలతో ఉండేలా, చూడాలని ఎల్లమ్మ తల్లిని కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో  ఎల్లమ్మ ఆలయకమిటీ అధ్యక్షుడు, జితేందర్ , పెద్దపల్లి మున్సిపల్ కౌన్సిలర్ భూతగడ్డ సంపత్, లక్ష్మీనారాయణ, రాజయ్య,గౌడ సంఘం అధ్యక్షుడు సిరిశెట్టి రాజయ్య , గొట్టేటి రాజయ్య, సిద్దగట్టయ్య, నరేష్ ,కుమార్ , కుమార్ తదితరులు పాల్గొన్నారు,