అగ్నిధారన్యూస్( కరీంనగర్ జిల్లా ):కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ ఎల్ బి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం ఆదివారం తెల్లవారుజామున వాగేశ్వరి కళాశాల సమీపంలో జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం టాటా ఏసీ కారు ఢీకొన్న దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, 15 మంది గాయాలపాలైన క్షతగాత్రులను పోలీసులు, చికిత్స నిమిత్తం కరీంనగర్ లోని ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు.
