అగ్నిధారన్యూస్( మంచిర్యాల ): సోమవారం రోజు మంచిర్యాలలో జరిగిన కార్యక్రమం మంచిర్యాల భీమా కుటుంబీకులకు అద్భుతమైన మరిచిపోలేని చారిత్రక సందర్భం.తేది.23-02-1973న ఆవిర్భవించిన మన మంచిర్యాల శాఖ23-02-2022న 49 వసంతాలు పూర్తి చేసుకుని 50వ ఏట అడుగుపెట్టనున్న మంచిర్యాల శాఖ ఈ సందర్భంగా ఎల్ఐసి ఏజెంట్లకు చేస్తున్నవృత్తిలోనైపుణ్యంపెంపొందించడానికి, సీనియర్ డివిజనల్ మేనేజర్ VMV. రామశాస్త్రి, డివిజనల్ మేనేజర్ సేల్స్. సోమ శేఖర్ రావు. మంచిర్యాల శాఖ చీఫ్ మేనేజర్ తదితరులు పాల్గొని ఎల్ ఐ సి ఏజెంట్ లకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏజెంట్లకు బిజినెస్ పై అవగాహన, పాలసీదారు లకు కలిగే లాభాలు వారికి పొంద ప్రయోజనాలు పాలసీదారులను ఏ విధంగా కౌన్సిల్ చేయాలి ,అనేటువంటి వివిధ అంశాల పైన అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఎల్ఐసి ఏజెంట్లు డివో లు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు .
