అగ్నిధారన్యూస్(  పెద్దపల్లి ): NTPC ప్రభావిత ప్రాంతమైన, కుందనపల్లి గ్రామ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, సోమవారం ఉదయం 9 గంటలకు చేపట్టిన కార్యక్రమం 26 కిలోమీటర్ల  చలో కలెక్టరేట్ – పాదయాత్ర కుందనపల్లి, బసంతనగర్, అందుగులపల్లి, అప్పన్న పేట్, బంధంపల్లెల, మీదుగా కొనసాగగా ఆయా గ్రామాల టిఆర్ఎస్ పార్టీనాయకులు ,కార్యకర్తలు,పూలమాలలతో ఘన స్వాగతం పలకగా, వందలాది మంది ప్రజలు తన వెంట తరలిరాగా, పెద్దపల్లికి సాయంత్రం  మూడు గంటల ప్రాంతంలో కలెక్టరేట్ కి చేరుకొని, ప్రజల సమక్షంలో జిల్లా కలెక్టర్ కి కుందనపల్లి గ్రామ ప్రజల సమస్యలు వివరిస్తూ, పరిష్కార మార్గాల కోసం విజ్ఞప్తి చేశారు. అందుకు జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ సమస్యను పరిష్కరించడానికి వారం రోజుల లోపు ntpc యజమాన్యం కుందనపల్లి గ్రామంలోని వ్యక్తులచే సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి, సమస్య పరిష్కార మార్గం చూపుతామని  పేర్కొన్నారు. ఈ సందర్భంగా కోరుకంటి చందర్ మాట్లాడుతూ, గ్రామాల్లోని ప్రజలు  పార్టీలకతీతంగా తన వెంట తరలిరాగా సమస్య పరిష్కారానికి, మార్గాన్ని చూపెడతానన్న పెద్దపల్లి జిల్లా  కలెక్టర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.