ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావును సన్మానిస్తున్న  రమేష్ యాదవ్

అగ్నిధారన్యూస్( హైదరాబాద్ ):మూడోసారి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా ప్రమాణ స్వీకారం చేసిన తానిపర్తి భాను ప్రసాద్ రావు ని పెద్దపల్లి కి చెందిన టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, పెద్దపల్లి అఖిల భారత యాదవ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, భాను ప్రసాద్ రావు కి అత్యంత సన్నిహితుడు, పెగడ రమేష్ యాదవ్, మంగళవారం రోజున ఎమ్మెల్సీ  భానుప్రసాద్ రావును  హైదరాబాదులో తన నివాసంలో పెద్దపల్లి టిఆర్ఎస్ నాయకులతో కలిసి,  శాలువతో ఘనంగా, సన్మానించి పూల గుచ్చం అందించారు. ఈ సందర్భంగా పెగడ  రమేష్ యాదవ్ మాట్లాడుతూ, నేను  అమితంగా అభిమానించే భాను ప్రసాద్ రావు మూడోసారి  ఎమ్మెల్సీగా గెలుపొందడం రాజకీయంగా చాలా అలా ఒక గొప్ప విషయమన్నారు. ఆయన మకుటంలేని మహారాజా అని కొనియాడారు. నిత్యం ప్రజా సమస్యల పైన స్పందించే నాయకుడు అన్నారు. రాబోయే రోజుల్లో మరెన్నో,ఉన్నత పదవులు చేపట్టాలని కోరుకుంటున్నానన్నారు. తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి పదవిని చేపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మేకల విజయ్,మేకల కుమార్ తదితరులు పాల్గొన్నారు.