అగ్నిధారన్యూస్( రామగుండం ): రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ లిమిటెడ్ (ఆర్ ఎఫ్ సి ఎల్) లో లోడింగ్ విభాగంలోని కాంట్రాక్టు కార్మికులను అన్యాయంగా ఏకకాలంలో 248 మందిని తొలిగించడం సరికాదని సిపిఐ నగర సహాయ కార్యదర్శి మద్దెల దినేష్ పేర్కొన్నారు. కొంత మంది అధికార పార్టీని అడ్డం పెట్టుకొని ఆర్ ఎఫ్ సి ఎల్ అంటేనే మా జేబు సంస్థల ప్రచారం చేసుకొని శాశ్వత ఉద్యోగాలు పెట్టిస్తామని, మరియు నివాసం సౌకర్యం, భూమి వస్తది, పిల్లలకు ఉచిత చదువు ఇలా అన్ని సకల సౌకార్యాలు కల్పిస్తామని నమ్మబలికి ఒక్కోక్క ఉద్యోగానికి లక్షలాది రూపాయాలు బాధితుల దగ్గర దోచుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు పని చెస్తున్న కాంట్రక్టు కార్మికుల అకారణంగా తొలగించి కొత్త కాంట్రాక్ట్ గుజరాత్ వారికి వచ్చిందని ఈ కార్మికులతో మాకు పనిలేదని చెప్పడం ఏంటి అని ప్రశ్నించారు? చావు కబూరు సల్లగా చెప్పినట్లు కాంట్రాక్ట్ కార్మికులకు సంబందించిన అంశంలో యజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు చెప్పడం విడ్డురంగా ఉందన్నారు.
కొంతమంది అధికారులు ముఖ్య ప్రజా ప్రతినిధులు వారి అనుచరులను, దళారులను ఏర్పర్చుకొని ఉద్యోగాల మాఫియా గా ఏర్పడి అంగోట్లో సరుకుల్లాగా ఉద్యోగాలు అమ్ముకోలేద ? అని ప్రశ్నించారు. నేడు యాజమాన్యం దొంగ మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయడం సరికాదన్నారు.
ప్రభావిత గ్రామాలు కాని, డివిజన్ల నిరుద్యోగులను తీసుకోకుండా ఇతర ప్రాంతాల నుండి కాసులకు కక్కర్తి పడి ఉద్యోగాలు ఆముకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టు కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని గేట్ పాస్ లు పు:నరుద్ధరన చేయాలని తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని దళారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తోలిగించిన కాంట్రాక్టు కార్మికులకు అండగా సిపిఐ మద్దతు ఉంటుందని యాజమాన్యం ఒంటెద్దు పోకడలు మానుకోవాలని, విధుల్లోకి కార్మికులను తీసుకోకుంటే అవసరమైతే కార్మికుల కుటుంబాలతో ఆందోళనలు తప్పవని మద్దెల దినేష్ హెచ్చరించారు.
