పెద్దపల్లి ప్రాంతం కూలీలతో బొంకూర్ కైలాసం అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ):బుధవారం రోజు పెద్దపెల్లి జిల్లా భవన నిర్మాణ కార్మికులను దళిత లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బొంకురి కైలాసం కూలీలను కలిసి వారు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వివిధ మండలాల నుండి వచ్చిన మేస్త్రిలకు పని దొరకక కూలీలుగా పని చేస్తున్నామన్నారు. బీహార్ నుండి మే స్త్రీలను కూలీలను తీసుకువచ్చి ఇక్కడ ఉన్న లేబర్ పొట్ట కొడుతున్నారు.పెద్దపెల్లి జిల్లాలో లోకల్ లో ఉన్న వారికే పని కల్పించాలని దళిత లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బొంకూరి కైలాసం డిమాండ్ చేశారు. ఇతర ప్రాంతాల నుంచి పెద్దపల్లి ప్రాంతానికి కొంతమంది భవన నిర్మాణ కాంట్రాక్టర్లు గుంపులుగా కూలీలని తీసుకువచ్చి ఈ ప్రాంతంలోని కూలీలకు పని దొరకకుండా చేయడాన్ని తప్పుబట్టారు.
………………………………………………………………………………………………………………………………
పాత రేషన్ కార్డుతో పనేంటి బొంకూర్ కైలాసం డిమాండ్..
