అగ్నిధార న్యూస్( బసంత్నగర్ ): బసంత్ నగర్ ఎస్ ఐ  మహేందర్ బుధవారం రోజు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ… రాఘవపూర్  గ్రామానికి చెందిన బావ బామ్మర్ది అయినటువంటి గాండ్ల సదయ్య మరియు మర్కు నవీన్ ఇద్దరు కలిసి రాఘవపూర్ శివారులో ఇటుక బట్టి వ్యాపారంను 3 సంవత్సరాల క్రితం ప్రారంభించారు.వ్యాపార లావాదేవీల్లో గొడవలు రావడం వల్ల పెద్దమనుషుల దగ్గర పంచాయతీ చేసుకుని గాండ్ల సదయ్య నవీన్ కు 28 లక్షలు ఇచ్చుటకు ఒప్పందం చేసుకుని ఎనిమిది లక్షల రూపాయలను తేదీ 15-2-2022 రోజున ఇవ్వాల్సి ఉండగా, ఇవ్వక పోయేసరికి నవీన్ బొమ్మ తుపాకీతో, తేదీ 27-02-2022 రోజున ఇటుక బట్టి దగ్గరికి వెళ్లి, డబ్బులు ఇవ్వకపోతే చంపుతానని బెదిరించాడు, అని బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకొని, అతని వద్దనుండి ఆన్లైన్లో కొనుగోలు చేసిన బొమ్మ /ఎయిర్ తుపాకీ ని, ఫోన్ ని స్వాధీనపరచుకోవడం జరిగిందని. ఎస్ఐ తెలిపారు.