అగ్నిధారన్యూస్ ( నస్పూర్ ) మంచిర్యాల జిల్లా నస్పూర్, మున్సిపాలిటీ పరిధిలోని సింగరేణి ఆఫీసర్స్ క్లబ్ లో, గురువారం రోజు ఎమ్మెల్యే దివాకర్ రావు, నస్పూర్ మండలంలోని(138) మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో 6వ వార్డ్ లోని లబ్ధిదారులు శ్రీపెళ్ళి శ్రీవాణి,జమల్పురి శివాణీ లకు, కౌన్సిలర్ పూదరి కుమార్, చెక్కులు అందించారు.ఈ కార్యక్రమానికి, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, నస్పూర్ కౌన్సిలర్లు,పార్టీ మండల అధ్యక్షులు, టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు.