గంటల వ్యవధిలోనే, హంతకుణ్ని అరెస్టు చేసిన పెద్దపల్లి పోలీసులు.

కట్టుకున్న భర్తే కడతేర్చాడు.

అనుమానమే పెనుభూతంగా మారింది.

వివరాలు వెల్లడించిన పెద్దపల్లి ఏసిపి సారంగపాణి.

విలేకర్ల సమావేశంలో పాల్గొన్న సీఐ ప్రదీప్ కుమార్ ,  ఎస్ ఐ రాజేష్, రాజ వర్ధన్.

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి (  క్రైమ్  ):శనివారం రోజు  పెద్దపెల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో పెద్దపల్లి ఏసీపి సారంగపాణి  పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు భార్యను హత్య చేసిన  కేసులో నిందితుని వివరాలు వెల్లడించారు.పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తెనుగువాడలో నివాసముంటున్న మెరుగు సంధ్య(27) ను భర్త గణేష్ కత్తితో  పొడిచి హత్య చేశాడు. అనే సమాచారం అందుకున్న పెద్దపల్లి సిఐ ప్రదీప్ కుమార్, ఎస్సై రాజేష్ లు శనివారం ఉదయం సంఘటన స్థలాన్ని పరిశీలించి, మృతురాలి తల్లి అయిన దిడ్డి మల్లవ్వ  రమేష్, తెనుగువాడ,  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించి. నిందితుని  అరెస్ట్  చేశారు.నిందితుని వివరాలు మెరుగు గణేష్ తండ్రి గట్టయ్య, 35 సం పద్మశాలి,దొంగాతుర్తికి  చెందిన మెరుగు గణేష్., పెద్దపల్లి కేంద్రం లోని తెనుగు వాడ లో నివాసం ఉంటున్నాడు. గత ఐదు సంవత్సరాలగా దుబాయ్ వెళ్లి అక్కడ ఉద్యోగం చేస్తూ జీవిస్తున్నారు. (2) నెలల క్రితం సెలవులో భాగంగా పెద్దపల్లి వచ్చాడు. వచ్చిన సమయం నుండి భార్య భర్తల మధ్య ఆర్థికపరమైన గొడవలు జరుగుతున్నాయి అన్నారు. అదేవిధంగా తన భార్య ఫై అనుమానం పెంచుకున్నాడు. శనివారం ఉదయం 09:30 గం.ల. సమయంలో భార్య ని ఇంట్లో కత్తి , కతేరతో గొంతు, మెడ, దవడ దగ్గర పొడవగా ఆమె అక్కడికిఅక్కడే మృతి చెందడం జరిగింది ఏసిపి సారంగపాణి తెలిపారు. వారికి ఒక కూతురు అంకిత, (9) సం.లు.కలదు. అని వివరించారు.
.