అగ్నిధార న్యూస్ ( పెద్దపెల్లి క్రైమ్): పెద్దపల్లి జిల్లాకేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. జీవితాంతం తోడు ఉంటాడని నమ్మిన అబలని కట్టుకున్నవాడే ,కాలయముడయ్యి , కర్కశంగా, కత్తితో పొడిచి చంపిన దుర్ఘటన జిల్లాలో కలకలం రేపుతోంది. శనివారం పెద్దపల్లి కేంద్రంలోని తెనుగువాడలో ఘటన చోటు చేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు, వివరాల్లోకి వెళితే, భార్యపై అనుమానంతో మెరుగు సంధ్యను, భర్త గణేష్ ,కత్తితో దారుణంగా పొడిచి హతమార్చాడు. ఈ దాడిలో సంధ్య అక్కడికక్కడే మరణించగా….సమాచారం అందుకున్న పెద్దపెల్లి సిఐ ప్రదీప్ కుమార్, ఎస్సై రాజేష్ లు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.