అగ్నిధారన్యూస్( కాల్వ శ్రీరాంపూర్ ):కాల్వ శ్రీరాంపూర్. మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో మంగళవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాలు శివనామస్మరణతో మార్మోగాయి .వేద పండితులు శివపార్వతులకు కళ్యాణ మహోత్సవం వేడుకలను కన్నుల పండుగ జరిపించారు.మండల కేంద్రంలోని పాండవుల గుట్టపై ఉన్న జగత్ మునేశ్వర స్వామి ఆలయంలో ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్, జడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి , సింగిల్విండో చైర్మన్ చదువు రామ్ చందర్ రెడ్డి లు శివ పార్వతి కల్యాణ మహోత్సవం లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయా గ్రామాల్లో జరిగిన శివపార్వతుల కళ్యాణ మహోత్సవం లో సర్పంచులు ఎంపీటీసీలు ప్రజలు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
