రేవంత్ రెడ్డి వాక్యాలు ఖండిస్తున్న నాయకులు
అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ):మంగళవారం రోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో, పెద్దపల్లి జిల్లా టిఆర్ఎస్ పార్టీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు కొంకటి లింగమూర్తి, పెద్దపల్లి మునిసిపల్ కోఆప్షన్ ఎండి షహీన్ ఉద్దీన్, మరియు తెరాస నాయకులు వెన్నం రవీందర్ మాట్లాడుతూ……టి పి సి సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సోమవారం రోజు హైదరాబాదులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ…… వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కెసిఆర్ ను బొంద పెడతా, అనడం ఆయన దివాలా కోరు రాజకీయాలకు నిదర్శనం, అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ధ్యేయంగా అనుక్షణం ప్రజల గురించి ఆలోచించి ప్రజా సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకు వెళుతున్న , ముఖ్యమంత్రి కేసీఆర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ దిగజారుడ రాజకీయాలకు పరాకాష్ఠ అన్నారు. మరోమారు ఇట్లాంటి దుందుడుకు మాటలు మానుకోవాలని హెచ్చరించారు. అధికారం కోసం కలలు కంటున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో దుకాణం మూసుకోవలసిందే అన్నారు. ప్రశాంత్ కిషోర్, ప్రకాష్ రాజ్ లను చూసి భయపడుతున్న, రేవంత్ రెడ్డి. 119 అసెంబ్లీ స్థానాలకు 110 టిఆర్ఎస్ గెలుస్తుంది జోస్యం చెప్పారు.
