నైట్ వాచ్ మెన్ డ్యూటీ లు రద్దు చేయాలి  అని డిమాండ్
అగ్నిధార న్యూస్ (మంచిర్యాల )
కన్నె పెల్లి వి ఆర్ ఏ దుర్గం బాపు హత్యను నిరసిస్తూ జిల్లాలోని గ్రామ రెవెన్యూ సహాయకులు మంగళవారం విధులు బహిష్కరించి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. వీఆర్ఏ ను హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన వీఆర్ఏ దుర్గం బాబు కుటుంబానికి 50 లక్షలు ఎక్స్ గ్రేషియ, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని నైట్ వాచ్ మెన్ డ్యూటీ లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.