అగ్నిధారన్యూస్ ( నస్పూర్ )
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు తలపెట్టిన రెండు రోజుల సమ్మె మంగళవారం ప్రారంభమైంది. శ్రీరాంపూర్ లోని సింగరేణి కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. కార్మికులు విధులకు హాజరు కాకపోవడంతో ఏరియాలోని భూగర్భ ఉపరితల గనులు నిర్మానుష్యంగా మారాయి. బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది.
