■  కార్యకర్త కుటుంబానికి రెండు లక్షల ప్రమాద బీమా చెక్ పంపిణీ.

■  ప్రతి కార్యకర్త కి పార్టీ అండగా ఉంటుంది.

■  స్వయంగా వెళ్లి ప్రమాద బీమా చెక్ అందించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. 

అగ్నిధారన్యూస్(  పెద్దపల్లి )సోమవారం రోజు   పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లి మండలం పాలితం గ్రామానికి చెందిన టీఆర్ ఎస్ పార్టీ కార్యకర్త గొట్టం రాజేశం ప్రమాదవశాత్తు మరణించగా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ ప్రమాద భీమా ఇన్సూరెన్స్ కంపెనీ నుండి మంజూరైన చెక్కును  మంత్రి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు మౌఖిక  ఆదేశాల మేరకు స్వయంగా వారి ఇంటికి వెళ్లి 2,00,000 /- (రెండు లక్షల రూపాయల) చెక్కును మృతుని భార్య గొట్టం రాజమల్లమ్మ కి  అందజేశారు సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ…….. పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్త కి పార్టీ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు ,టిఆర్ఎస్ నాయకులు ఇతరులు పాల్గొన్నారు.