■  భోజనాలు పెట్టి సుమారు  నాలుగు గంటల పాటు మంత్రి జరిపిన సమావేశం రహస్యమేంటి ?

■  లబ్ధిదారుల ఖాతాల్లోకి రెండో విడత గొర్రెల పంపిణీ నగదు బదిలీ కావాలనేది ప్రధాన డిమాండ్ గా వినిపిస్తుంది.

■  తెలంగాణలో ఉన్న యాదవ కుల సంఘాలన్నీ రద్దు చేసుకొని ఓకే*సంఘముగా లేదా జేఏసీగా ఏర్పడటమా?

■  అన్ని జిల్లాలు విస్తృతంగా పర్యటించిచి  పది లక్షల మందితో శక్తి ప్రదర్శన చేయడానికి సన్నాహలా?

■  ఇంత అర్జెంటుగా మంతనాల రహస్యం ఏంటి

■  రాజకీయ ఎత్తుల కులం కోసం చర్చల

■  కొంచం వేచి చూస్తే త్వరలో అన్నీ బహిరంగ పడే అవకాశం ఉంది                

అగ్నిధారన్యూస్( డెస్క్ న్యూస్ )

అత్యంత  విశ్వాసనీయ సమాచారం ప్రకారం అందిన సమాచారం మేరకు ……..
.శనివారం రోజు తెలంగాణ పశువర్ధక సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాదులోని మాసబ్ ట్యాంక్ సమీపంలో తన కార్యాలయంలో ఒక ముఖ్య సమావేశం నిర్వహించినట్లు సమాచారం…. ప్రతి ఉమ్మడి జిల్లాకి ఒకరు యాదవ సంఘం ముఖ్య నాయకున్ని తన కార్యాలయానికి ఆహ్వానించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అతి ముఖ్యమైన నాయకులతో రహస్యంగా జరిగిన సమావేశం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. స్వయంగా మంత్రి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయించడం ఇక్కడ ప్రధానాంశం ……సమావేశానికి హాజరైన మంత్రి ….. వచ్చిన యాదవ సంఘం నాయకులుకి దిశా, నిర్దేశన ఏం చేశారనే సమాచారం గోప్యం….. తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని ఊహాగానాలు జోరుగా ఊపందుకున్న తరుణంలో ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది …. ఐదు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల ఫలితాలతో తెలంగాణలో రోజురోజుకు మారుతున్న రాజకీయ సమీకరణాలు, పరిణామాలను నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కులాన్ని ప్రసన్నం చేసుకునే క్రమంలో ఈ సమావేశం జరిగిందా ……. లేదు యాదవ కుల ప్రయోజనాల కోసం ఈ సమావేశం జరిగిందా ….అనేది ఇప్పుడు ఇక్కడ ప్రశ్న.. రాజకీయ ఎత్తులా…కులం కోసం చర్చలా…. అనేది సస్పెన్స్ మారింది. మంత్రి హరీష్ రావుకు అత్యంత సన్నిహితులుగా చెప్పబడే మెదక్ జిల్లాకు చెందిన పోచబోయిన శ్రీహరి యాదవ్ మరికొంత మంది గొర్రెల పెంపకం దారుల సంఘం ముఖ్య నాయకులు రాష్ట్రంలోని గొర్రెల సహకార సంఘాల సభ్యుల పక్షాన ఈ మధ్యకాలంలో సంఘం నాయకులతో కలిసి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని కలిసి మొదటి విడత గొర్రెల పంపిణీ లబ్ధిదారులకు గొర్రెలను ఇచ్చినట్లు కాకుండా….. రెండో విడత గొర్రెల పంపిణీ ( దళిత బంధు పథకం లాగానే ) లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలోనే నేరుగా …… ప్రభుత్వం డబ్బులు జమ చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కి వినతి పత్రం సమర్పించడమే కాకుండా ఒత్తిడి తెస్తున్నారు అనేది సమాచారం. ఈ విషయమై సమావేశం ఏర్పాటు చేశారా అనేది కూడా ఇక్కడ  చర్చనీయాంశం. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకూ మారుతున్న రాజకీయాల పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలో ఉన్న యాదవ సంఘాలని ఏకీకృతం చేసి ఒక గొడుగు కిందికి తీసుకు వస్తారా….. అన్ని జిల్లాలలో విస్తృత పర్యటనలు చేసి ఏప్రిల్ ,మే నెలలో రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది యాదవులతో హైదరాబాద్   కేంద్రంలో ఒక పెద్ద భారీ బహిరంగ సమావేశం నిర్వహించబోతున్నారు అనేది అగ్నిధారకు ఉన్న విశ్వాసనీయ సమాచారం . శనివారం నిర్వహించిన సమావేశంలో ఉమ్మడి మెదక్ జిల్లా గొర్రెల పెంపకం దారుల సంఘం అధ్యక్షులు శ్రీహరి యాదవ్, అరిగెల నాగేశ్వరరావు, యాదవ్, గోస్కుల శ్రీనివాస్, యాదవ్, మారం తిరుపతి, యాదవ్, రాజారాo యాదవ్, బైకానీ శ్రీనివాస్,యాదవ్ , మేకల రాములు యాదవ్, మరి కొంతమంది ముఖ్య నాయకులు పాల్గొన్నారు అనేది సమాచారం.