■ పెరిగిన ధరలతో ప్రజలపై ఆర్థిక భారం.
■ ధరల నియంత్రణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం.
■ సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ నగేష్….
అగ్నిధార న్యూస్( రామగుండం )కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని సమతా సైనిక్ దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ నగేష్ ఆదివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..… దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరిచే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. దీని ప్రభావంతో నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి, పేద ,మధ్య తరగతి కుటుంబాల జీవితాలు అంధకారంలోకి నెట్టివేయ పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. లేనియడల ప్రజాసంఘాలను కలుపుకొని సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో విస్తృతంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
